బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ సైలెంట్ గానే వచ్చి థియేటర్స్ లో ఊచకోత కోసింది. పలు సినిమాల రికార్డులను ధురంధర్ పార్ట్ 1 తుడిచిపెట్టేసింది. ఆదిత్య ధర్ మేకింగ్, రణ్వీర్ సింగ్ యాక్షన్, ముఖ్యంగా అక్షయ్ ఖన్నా విలనిజం, సంజయ్ దత్ యాక్టింగ్, సారా అర్జున్ గ్లామర్, మాధవన్ లుక్స్, అలాగే BGM అన్ని ధురంధర్ పార్ట్ 1 ని అంచనాలకు మించి ప్రేక్షకులకు నచ్చేశాయి.
ధురంధర్ సీక్వెల్ ధురంధర్ ద రివెంజ్ మార్చ్ 19 న రాబోతుంది. మరి పార్ట్ 2 పై ప్రస్తుతం ఉన్న అంచనాలు గురించి వేరేగా మాట్లాడుకోవాలా.. ఆ అంచనాలను ఇంకా పెంచుతూ మేకర్స్ ధురంధర్ 2 ట్రయిలర్ ఈరోజు శనివారం 11 గంటలకు వదిలారు.
ధురంధర్ కు మించి ధురంధర్ 2 యాక్షన్ ఉంది. రణ్వీర్ సింగ్ విశ్వరూపం, సంజయ్ దత్ విలనిజం, జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో రణ్వీర్ సింగ్ విధ్వంశం, ఆదిత్య ధర్ డైరెక్షన్, మాధవన్ పెరఫార్మెన్స్, అర్జున్ రాంపాల్ విలనిజం, BGM అన్ని ధురంధర్ 2ట్రైలర్ లో హైలెట్స్ గా నిలిచాయి.
ధురంధర్ 2 ట్రైలర్ చూసినవారు.. దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి థియేటర్స్ ని తగలబెట్టెయ్యడం ఖాయం, రణ్వీర్ సింగ్ యాక్షన్ వేరే లెవల్, ఆ BGM ఏమిట్రా అలా కొట్టారు అంటూ ధురంధర్ 2 ట్రైలర్ వీక్షించినవారు చెబుతున్న మాట. మరి మార్చ్ 19 వరకు ధురంధర్ 2 కోసం వెయిట్ చెయ్యడమంటే చాలా కష్టం.