ఒకప్పుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తెలుగు సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు. వాటితో పాటు తమిళ సినిమాలకు సంగీతం అందించేవారు. కానీ థమన్ పాంలోకి రావడంతో దేవి శ్రీకి అవకాశాలు తగ్గాయి. అప్పటికే ఓ వేవ్ లా వెళ్తోన్న దేవి శ్రీ కంటే థమన్ తో కొత్తగా ట్రై చేద్దామని మేకర్స్ అతడికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు.
ప్రముఖంగా ఓ సీనియర్ డైరెక్టర్ తో వివాదం కారణంగా దేవి శ్రీని పూర్తిగా పక్కన బెట్టాడు. ఆ వివాదం డీఎస్పీకి చాలా నెగిటివ్ గానూ మారింది. ఆ వివాదంలో తప్పు ఎవరిది అనే కారణాలు వెతికి మరీ కొంత మంది పక్కనబెట్టినట్లు అప్పట్లో మీడియా కథనాలు వెడెక్కించాయి. కానీ డీఎస్పీ సంగీతం అంటే కొందరికి ఎంతో నమ్మకం. సూపర్ స్టార్ మహేష్ సినిమాకు డీఎస్పీ పని చేస్తున్నాడంటే? ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారు.
సుకుమార్ కూడా అంతే కాన్పిడెంట్ గా ఉంటాడు. ఇప్పటి వరకూ సుకుమార్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు డీఎస్పీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని సినిమాలకు డీఎస్పీ సంగీతం అందించినా అదే సినిమా ఆర్ ఆర్ కోసం తమన్ తీసుకోవడంతో దేవి శ్రీ ప్రాధాన్యత తగ్గినట్లు అయింది.
ఆర్ ఆర్ ఇవ్వడంలో డీస్పీ ఎంత మాత్రం తీసేసే కంపోజర్ కాదు. తనకంటూ ఓ బలం ఉంది. కానీ ఇప్పుడా బలంపైనే కొందరు దర్శకులు కొడుతున్నారు. వాళ్ల తీరు చూస్తుంటే కావాలనే తప్పిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో వెర్షన్ ఏంటంటే? దేవీ శ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న నేపథ్యంలో తానే ఖాళీలేక అవకాశాలు వదులుకుంటున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది.