సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ అండ్ డీకే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.ఓ హై కాన్సెప్ట్ సూపర్ హీరో చిత్రంగా పరిమిత బడ్జెట్ లోనే నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ విషయంలో స్ట్రిక్ట్ కండీషన్ పెట్టారు. భారీ గా ఖర్చు చేయోద్దని సింపుల్ బడ్జెట్తో మంచి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిందామని ప్రామిస్ చేయించుకున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
అయితే ఈ సినిమా నిర్మాణంలో సమంత కూడా భాగస్వామి కాబోతుందని సమాచారం. 20 శాతం పెట్టుబడి సినిమాలో పెట్టాలని నిర్ణయించుకుందిట. మరి ఇది సమంత ప్లానింగేనా? లేక వెనుక మరోకరు ఉన్నారా? అంటే భర్త రాజ్ నిడిమోరు కనిపిస్తున్నాడు. ఇటీవలే సమంత-రాజ్ నిడిమోరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. పెళ్లైన తర్వాత రాజ్ నిడిమోరు దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న తొలి చిత్రమిదే.
దీంతో ఈ సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెడదామని రాజ్ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమంత ముందుకు వెళ్తుంది. సమంత ఇప్పటికే ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో `శుభమ్` అనే చిత్రాన్ని నిర్మించింది. మరో చిత్రం `మా ఇంటి బంగారం` ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా భర్త సినిమాతో బాలీవుడ్ కి సామ్ నిర్మాతగా ఎంట్రీ ఇస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఇదే సంస్థలో నిర్మించాలని సామ్ భావిస్తోంది.