యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా 24 సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని విజయాలు సాధించాయి. మరికొన్ని అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేదు. ప్రతీ సినిమా విషయంలో హీరోలు ఎంతో కాన్పిడెంట్ గా ఉంటారు. ఆ నమ్మకం ఒక్కోసారి నిలబడుతుంది. మరికొన్నిసార్లు నిలబడదు. బాగా నమ్మకంగా ఉన్న సినిమాలు ఫెయిలైతే మాత్రం ఇంకొంచెం పెయిల్యూర్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో `వృషకర్మ` అనే మిస్టికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఓ గుహ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో చైతన్య సాహసకుడి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఉద్దేశించి నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తన కెరీర్ లోనే `వృషకర్మ` ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇలాంటి ప్రకటన చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ప్రకటనలు చేయరు. దీంతో `వృషకర్మ`పై నాగ చైతన్య ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు అన్నది అద్దం పడుతుంది. గతంలో చాలా సినిమాల్లో నటించాడు ఏ సినిమాకు ఇలాంటి ప్రకటన చేయలేదు.
`మజిలీ`, `తండేల్`, `లవ్ స్టోరీ` ఇలా కొన్ని క్లాసిక్ చిత్రాలున్నాయి. కమర్శియల్ గానూ మంచి విజయం సాధించాయి. కానీ ఆ సినిమాల రిలీజ్ ముందు చైతన్య ఇలాంటి ప్రకటన చేయలేదు. దీంతో `వృషకర్మ` ఎంత ప్రత్యేకమన్నది అద్దం పడుతుంది.