Advertisement
Google Ads BL

అడక్కుండానే వస్తున్న వారణాసి అప్ డేట్స్


దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా స్టార్ట్ చేసిన పది నెలలకు పైగా ఆ సినిమాకి సంబందించిన చిన్న విషయం కూడా లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఒకే ఈవెంట్ తో పలు అప్ డేట్స్ అందించిన రాజమౌళి ఆతర్వాత తన టీమ్ తో కలిసి అడక్కుండానే అనేక విషయాలు రివీల్ చేస్తూ వారణాసి ని ఎప్పుడు వార్తల్లో ఉండేలా చూస్తున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్ ముచ్చట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. కెన్యా ఫారెస్ట్ లో చేసిన షూటింగ్ విషయాలను చెబుతూ ప్రియాంక చోప్రా చాలా ఎగ్జైట్ అయ్యింది. కెన్యా అడవుల్లో జింకల గుంపుల మధ్యన షూటింగ్ చేస్తుంటే ఏదో తెలియని అనుభూతిని పొందాను.

వాటి ముఖాలు అంత దగ్గరగా చూస్తుంటే అవి ఎన్ని వేల ఏళ్లుగా భూమి మీద మనుగడ సాగిస్తున్నాయో అనేది అర్థమైంది. నిజంగా ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో, ఈ భూమిపై జీవపరిణామం ఎంత గొప్పదో వాటిని చూస్తే తెలిసింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆ అడవిలో చేసిన వారణాసి షూటింగ్ ఒక గొప్ప అనుభూతి అంటూ ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. 

Priyanka Chopra Shares Wild Experience Shooting Varanasi:

Priyanka Chopra told the story of shooting of Varanasi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs