దివ్వెల మాధురి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలోని ఓ కాటేజ్ లో బిగ్ బాస్ రన్నర్ తనూజ పుట్టస్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. గతంలో శివజ్యోతి శ్రీవారి అన్నప్రసాదం పై చేసిన వెకిలి కామెంట్స్, నిన్నగాక మొన్న గీతూ రాయల్ తన టీమ్ తో కలిసి వేంకటేశ్వరుని సన్నిధిలో రీల్స్ చెయ్యడం పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆతర్వాత క్షమాపణలు చెప్పారు.
తాజాగా మాధురి-తనూజ లు అక్కడ బర్త్ డే వేడుకలు జరుపుకోవడంపై టీటీడీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. దివ్వెల మాధురి, తనూజలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో దివ్వెల మాధురి, తనూజలు బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది.
అసలు తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం. అందుకు సంబందించిన పుట్టినరోజు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం పద్దతి కాదు. వీరిపై చర్యలకు ఇప్పటికే విజిలెన్స్ కు ఫిర్యాదు అందింది అంటూ టీటీడీ అధికారులు తెలియజేసారు.
తనూజ బర్త్ డే సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసుకుని నిన్న మార్చ్ 5 న దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాధురి, తనూజలు శ్రీవారి దర్శనం చేసుకున్న ఫొటోస్ షేర్ చేసారు.