Advertisement
Google Ads BL

హత్యాయత్నం అంటూ కొలికపూడి కామెంట్స్


టీడీపీ పార్టీకి పంటికింద రాయిలా తయారైన తిరువూరు ఎమ్యెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఎంపీ కేశినేని ఆధిపత్యాన్ని అస్సలు అంగీకరించడం లేదు. చిన్ని విషయంలో కొలికపూడి ఎప్పటికప్పుడు అధిష్టానాన్ని కూడా లెక్క చెయ్యకుండా గీత దాటుతున్నాడు. తనకు ఎమ్యెల్యే టికెట్ ఇవ్వాలంటే ఐదు కోట్లు డబ్బు ఇవ్వాలని కేశినేని చిన్ని డిమాండ్ చేసాడు అంటూ కొలికపూడి ఇప్పటికి అదే కామెంట్స్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా గుడిలో జరిగిన గందరగోళం తర్వాత కొలిల్లపూడి మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. కేశినేని చిన్ని చేతిలో పట్టు వస్త్రాలు లాక్కుని తన చేతుల మీదుగా స్వామి వారికి సమ్పర్పించడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే లోపు కొలికపూడి తనపై హత్యాయత్నం అంటూ డ్రామా స్టార్ట్ చేసాడు.

ఈనెల 2న నాపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది, నాపై దాడి చేస్తారని నా గన్ మెన్ కి 15సార్లు ఇంటెలిజెన్స్ ఫోన్ చేసింది, నన్ను భూమ్మీద లేకుండా చేయాలనుకున్నారు, నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో కొందరు ప్రయత్నించారు, నెమలి గ్రామంలో కరెంట్ కట్చేసి దాడి చేయాలనుకున్నారు, నెమలిలో తప్పించుకుంటే కొణిజర్ల, ఊటుకూరులో దాడికి ప్లాన్ వేశారు. 

పోలీసులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గినట్టున్నారు, నాకు భద్రత కల్పించమని సీఎం చంద్రబాబును కోరుతున్నా, నన్ను చంపాలని మాట్లాడుతున్నారు, తిరువూరు అధ్యక్షుడు ఫేక్లా నాయక్ అంటున్నాడు , దాడి జరుగుతుందని సమాచారమున్నా.. నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎంత అవమానించినా భరిస్తా, నా జాతి జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తా, అవాస్తవాలు, కుట్రలతో నన్ను ఆపలేరు అంటూ కొలికపూడి రెచ్చిపోయి మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు 

MLA Kolikapudi Srinivasa Rao:

Kolikapudi Srinivasa Rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs