దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను ఏమాత్రం పట్టించుకోకుండా.. తాజాగా తన స్నేహితురాలు త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలో ప్రముఖ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వీరిద్దరూ జంటగా హాజరుకావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఈ ఇద్దరూ జంటగా ఇలా కలిసి పబ్లిక్ ఈవెంట్‌కు రావడం మీడియా హెడ్ లైన్స్ కి మరింత ఊతమిచ్చినట్టయింది. ముఖ్యంగా ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. వారి మధ్య ఉన్న అనుబంధంపై నెటిజనులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
మరోవైపు విజయ్ తన భార్య సంగీతతో ఉన్న విభేదాలను కోర్టు బయటే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ రంగప్రవేశం.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఈ వివాదాన్ని సాగదీయకుండా సామరస్యపూర్వకంగా ముగించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి పర్సనల్ లైఫ్‌లో ఎన్ని గొడవలు ఉన్నా.. బయట మాత్రం తన పని తాను చేసుకుంటూ.. గాసిప్పులను బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్నారు. విడాకుల పిటిషన్ విచారణకు వచ్చేలోపు ఈ విషయంలో ఏదైనా స్పష్టత వస్తుందేమో చూడాలి.