Advertisement
Google Ads BL

మొన్న జన నాయకన్-ఇప్పుడు టాక్సిక్


పాపులర్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కి దెబ్బమీద దెబ్బ. ప్రస్తుతం కన్నడ నుంచి తెలుగు వరకు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన కెవిఎన్ ప్రొడక్షన్ వారు సినిమాలు విడుదలకు ముందు చివరి నిమిషంలో వాయిదాలు పడడం ఆ ప్రొడక్షన్ హౌస్ కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. 

Advertisement
CJ Advs

మొన్నటికి మొన్న కోలీవుడ్ లో విజయ్ నటించిన జన నాయకన్ చిత్రం విడుదలకు ముందు సెన్సార్ ప్రోబ్లెంస్ తో వాయిదా పడడం, ఆ సమస్య ఇప్పటికి సద్దుమణగక, సినిమా విడుదల కాక కెవిఎన్ ప్రొడక్షన్ పై అటు అభిమానులు, ఇటు ఓటీటీ ఒత్తిడి పెరిగిపోవడమే కాదు  అప్పులు తెచ్చి బడ్జెట్ పెట్టారు, ఆ వడ్డీలు కట్టలేకపోతున్నారు.

ఇప్పుడు కన్నడలో భారీ బడ్జెట్ తో నిర్మించిన యష్ టాక్సిక్ గల్ఫ్ యుద్ధం కారణంగా మార్చ్ 19 నుంచి ఏకంగా మూడు నెలలు వాయిదా పడడం ఈ ప్రొడక్షన్ హౌస్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. గల్ఫ్ దేశాల యుద్ధం ఎఫెక్ట్ తో టాక్సిక్ వాయిదా అన్న దాని కోసం తెచ్చిన అప్పులు, వడ్డీల భారం అన్ని నిర్మాతలకు తలకు మించిన భారం.

ఆప్పుడు జన నాయకన్, ఇప్పుడు టాక్సిక్ సినిమాలు రెండింటితో ప్రొడక్షన్ హౌస్ పై ఆర్ధిక భారం పెను భారంగా మారింది. 

Jana Nayagan-Toxic:

KVN Production
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs