ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న ఏ హీరో కానీ, ఏ హీరోయిన్ కానీ చెయ్యని విధంగా విజయ్ దేవరకొండ - రష్మీకల జంట చేసింది. పెళ్లిని రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో కొద్దిమంది అతిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఆతర్వాత రష్మిక తెలుగింటి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పూజల్లో పాల్గొంది. రష్మిక - విజయ్ దేవరకొండ తన ఊరి ప్రజలకు స్పెషల్ భోజనాలు పెట్టడం.
ఇక విజయ్ దేవరకొండ - రష్మికలు కలిసి ఫ్యాన్స్ మీట్ పెట్టి వారికి ప్రేమతో భోజనాలు వడ్డించడం. మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో మాట్లాడుతూ వారికి స్పెషల్ విందు ఏర్పాటు చెయ్యడం, అదే రోజు అంటే ఈరోజు సాయంత్రం విజయ్ దేవరకొండ-రష్మిక లు వెడ్డింగ్ రిసెప్షన్ లో తెలుగింటి సంప్రదాయం ఉట్టిపడేలా రష్మిక శారీ లోను, విజయ్ దేవరకొండ ట్రెడిషనల్ వేర్ లో కనిపించి కనువిందు చేసారు.
విజయ్ దేవరకొండ-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ కి ప్రముఖులు హాజరవడం ఇలా ప్రతి విషయంలోనూ ఈ జంట తమ ప్రత్యేకతను చూపించింది. అసలు పెళ్లి చేసుకున్న ఏ సెలెబ్రిటీ జంట ఈ విధంగా చేసి ఉండదేమో అనిపించేలా విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలుజరిగాయి. అదే ఇప్పుడు టాలీవుడ్ లో హైలెట్ అవుతున్న విషయం.