కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు ముగింపు పలికి రాజకీయంగా ఎదిగేందుకు కష్టపడుతున్న సమయంలో ఆయన భార్య సంగీత విజయ్ తో విడాకులు కోరుతూ కోర్టుకెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ తనని మానసికంగా బాధపెడుతున్నాడు, తోటి నటితో సన్నహిత సంబధాలు పెట్టుకుని మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు అంటూ సంగీత కోర్టులో విడాకులు పిటిషన్ వెయ్యడం సంచలనం సృష్టించింది.
ఈలోపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ విజయ్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే విజయ్ తన విడాకుల మేటర్ ని అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తున్నట్లుగా ఓ వార్త కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.
భార్య సంగీత కు, పిల్లల సంరక్షణ కోసం రూ. 250 కోట్లు ఇచ్చేసి కోర్టుకు వెళ్లకుండా విడాకుల మేటర్ ని పరిష్కరించాలని, అలా అయితేనే తనకు రాజకీయంగా ఎఫెక్ట్ అవ్వదని విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయ్-సంగీత విడాకుల విషయం కానీ, ఇలా సెటిల్మెంట్ విషయం కానీ ఏది అధికారికంగా క్లారిటీ లేదు.