టీడీపీ పార్టీ కి కొలికపూడి పెద్ద తలనెప్పిలా తయారయ్యాడు. ఇప్పుడు కాదు ప్రతిసారి కొలికపూడి ఏదో ఒకటి చేసి అధిష్టానానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తో విభేదాలను రోడ్డుకీడ్చి రచ్చ రచ్చ చేస్తూ పార్టీ పరువు తీస్తున్నాడు. ఎప్పుడు పార్టీకి చిరాకు తెప్పించే కొలికపూడి మరోసారి అదేపని చేసాడు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రోటోకాల్ వివాదం ముదిరి పాకాన పడింది. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ఎంపీ కేశినేని చిన్ని చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కోవడం హాట్ టాపిక్ అయింది.
స్వామివారి కల్యాణానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి ఫ్యామీలీలతో సహా హాజరవగా.. ఆలయ కమిటీ కేశినేని చిన్ని తో స్వామి వారి పట్టువస్త్రాలను ఇప్పిస్తున్న సమయంలో కొలికపూడి ఆవేశంగా కేశినేని చిన్ని చేతిలో పట్టువస్త్రాలు లాక్కుని ఆ వస్త్రాలను తలపై పెట్టుకున్నారు. దానితో చిన్ని చేసేది లేక గమ్మునుండిపోయారు.
అయితే ఎంపీ వర్గీయులు ఎమ్యెల్యే అనుచరులపై దాడికి దిగగా.. కేశినేని చిన్ని వారిని వారించి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం కేశినేని చేతిలో వస్త్రాలు కొలువుపూడి లాక్కొన్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు ఇంకా ఉపేక్షించడం కరెక్ట్ కాదు అని టీడీపీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.