మలయాళ సూపర్ హిట్ ఫిలిం జయ జయ జయహే చిత్రాన్ని తెలుగులో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ లు ఓం శాంతి శాంతి శాంతిః గా రీమేక్ చేసారు. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి సో సో టాక్ వచ్చింది. మలయాళ చిత్రాన్ని చూసిన వారు ఓం శాంతి శాంతి శాంతిః ని థియేటర్స్ లో లైట్ తీసుకున్నారు.
యాజిటీజ్ గా కాకపోయినా.. రీమేక్ అని తెలిసిన వారు ఆ ఓం శాంతి శాంతి శాంతిః ని పనిగట్టుకుని థియేటర్స్ లో చూడడమెందుకు ఓటీటీలో చూడొచ్చని ఫిక్స్ అయ్యారు. ఇక ఓం శాంతి శాంతి శాంతిః డిజిటల్ హక్కులను తీసుకున్న ఆహా ఓటీటీ వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తెచ్చేసారు.
మార్చ్ 3 అంటే ఈరోజు నుంచి ఆహా ఓటీటీ వేదికగా ఓం శాంతి శాంతి శాంతిః స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. సో థియేటర్స్ లో లైట్ తీసుకున్న ఈ మూవీ ఆహా ఓటీటీ నుంచి వీక్షించేయ్యండి.