Advertisement
Google Ads BL

కొడాలి నాని టైమ్ వచ్చేసింది - లోకేష్ మేలుకో


కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కోరుకున్నది ఒక్కటే.. అధికార మదంతో వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయి నోటికొచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆయన కుటుంబం వాగినా వైసీపీ నేతలందరినీ జైలుకు పంపాలని కోరుకుంటున్నారు. కోడలి నాని, వల్లభనేని వంశి, రోజా, అంబటి, జోగు రమేష్ ఇలా చాలామంది నారా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం పై టీడీపీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Advertisement
CJ Advs

అయితే వల్లభనేని వంశి, అంబటి, జోగు రామ్మెహన్ లాంటి వాళ్ళు జైలుకెళ్లినా కొడాలి నాని అనారోగ్య కారణాలతో తప్పించుకున్నాడు. ఆ విషయంలో టీడీపీ శ్రేణులు ఎంతో అసంతృప్తి తో కనిపిస్తున్నారు. నాని ని లోకేష్ ఎలాగైనా జైలులో పెట్టాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.  

తాజాగా కొడాలి నాని కి ఆ సమయం ఆసన్నమైంది అనిపిస్తుంది. కారణం అంబటి రాంబాబు జైలులో ఉండి వచ్చాక నిన్న అంబటిని కలిసి పరామర్శించిన కొడాలి నాని.. మీడియా తో మట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడరు. మీ ఎర్ర బుక్కులు, కేసులు, అరెస్టులు, జైలు చూసి భయపడి వైసీపీలో ఎవరు రాజకీయాలు వదిలి పారిపోలేదు. 

మేమంతా వైసీపీ లోనే ఇక్కడే ఉన్నాం. జగన్ తోనే ఆయన వెంటే ఉన్నాం. అంబటి రాంబాబుని జైల్లో పెట్టి కేవలం 18 రోజులలో మీరే ఆయనను హీరోని చేశారు. లోకేష్.. నీ బుక్ లో జగన్ పేరు వ్రాసుకున్నా, లేదంటే జగన్ నీ గురించి తలుచుకున్నా నీకే ప్రమాదం తెలుసుకో, ఇది మీ బాలకృష్ణ డైలాగే.. నా సంగతి మర్చిపోయావా నారా లోకేష్ అంటూ కొడాలి నాని మరోసారి నారా లోకేష్ ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఇలాంటి వాళ్ళు ఇంకా జైలుకు పోకుండా బయట తిరగడం కరెక్ట్ అంటారా ఇది టీడీపీ శ్రేణుల ప్రశ్న. అనారోగ్యం పేరుతొ డ్రామాలాడే నానిని అరెస్ట్ చెయ్యాలని నారా లోకేష్ ని డిమాండ్ చేస్తున్నారు. 

Kodali Nani vs TDP fans:

Kodali Nani 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs