లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి ఏ తెలుగు స్టార్ తో తదుపరి మూవీ చేస్తారో అని ఎదురు చూస్తే నిర్మాత నాగవంశీ తో కలిసి వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ సూర్య తో సినిమా స్టార్ట్ చేసారు. షూటింగ్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రివీల్ చేసారు.
సూర్య విశ్వనాధ్ అండ్ సన్స్ అంటూ చాలా స్టైలిష్ లుక్ తో చేతిలో బిడ్డతో దర్శనమిచ్చారు. టైటిల్ విశ్వనాధ్ అండ్ సన్స్ అంటూ క్రేజీగా టైటిల్ ని ఫిక్స్ చేసి సూర్య లుక్ రివీల్ చేసారు. సూర్య చేతిలో బిడ్డ, సూర్య ఇద్దరూ క్లాస్ గా కనిపిస్తున్నారు. మరి వెంకీ అట్లూరి సూర్య తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనే విషయంలో అందరూ క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు.
విశ్వనాధ్ అండ్ సన్స్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు స్పష్టతనిచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తుంది. వరస అపజయాలతో ఉన్న సూర్య కి వెంకి అట్లూరి ఎలాంటి సక్సెస్ ని అందిస్తారో అని సూర్య ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ.