ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో ఏడడుగులు నడిచి ఒక ఇంటి వారైన హీరో విజయ్ దేవరకొండ-రష్మిక ల జంట ఆతర్వాత రోజు హైదరాబాద్ చేరుకుంది. నిన్న ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని టీటీడీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన VIROSH జంట ఆదివారం మధ్యాన్నం అల్లు అరవింద్ ఇంట జరిగిన అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుకల్లో మెరిశారు.
ఈరోజు సోమవారం ఉదయం విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక తో కలిసి స్వగ్రామం బయలుదేరారు. నాగర్ కర్నూల్- బలమూరు మండలం తుమ్మన్‌పేట చేరుకున్న విజయ్-రష్మిక దంపతులు అక్కడ నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు.
దాని కోసం తుమ్మన్ పేటలో భారీ ఏర్పాట్లు చేసారు. విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులు అక్కడికి వస్తున్నారు అని తెలియగానే అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేస్తున్నారు.