సీనియర్ స్టార్లను పక్కన బెడితే? మహేష్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ అంతా ఇప్పటికే చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ లో అలరించారు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఎవరి ప్రత్యేకతను వారు చాటారు. కొత్తగా ఈ స్టార్స్ కు మళ్లీ ప్యాక్స్ ప్యాక్ చేయడం పెద్ద పనేం కాదు. అలవాటు పడిన శరీరం కాబట్టి పాత్ర డిమాండ్ చేసిందంటే సై అంటూ రంగంలోకి దిగిపోతారు. ఆ తర్వాత తరం హీరోలు కూడా సిక్స్ ప్యాక్ కోసం ఎంత మాత్రం రాజీపడలేదు.
దర్శకుడు కోరాలే గానీ రెడీ అవ్వడానికి తాము సిద్దం అనేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకూ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించలేదు. కెరీర్ ఆరంభంలో మార్షల్ ఆర్స్ట్ నేపత్యంలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో చొక్కా విప్పి నటించారు. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంలో చేతులు..కాళ్లు మీద నుంచి కార్లు ఎక్కించుకుని హైలైట్ అయ్యాడు. `తమ్ముడు` చిత్రంలో బాక్సర్ గాను మెప్పించాడు.
ఆ సినిమా కోసం రింగ్ లో చొక్కా విప్పాడు. ఆ తర్వాత పీకే మళ్లీ చొక్కా విప్పింది లేదు. ప్రత్యేకించి సిక్స్ ప్యాక్ లుక్లో కనిపించింది లేదు. ఈ విషయంలో పవన్ అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంలోనే ఉన్నారు. మా దేవుడు, అన్నయ్య సిక్స్ ప్యాక్ ఎప్పుడు చేస్తాడంటూ సోషల్ మీడియాలో అడిగిన సందర్భాలెన్నో.
ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల్లోనైనా పవన్ ఆ ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అయితే పవన్ వయసు ఇప్పటికే 54 ఏళ్లు. అయినా వయసు సిక్స్ ప్యాక్ లుక్ కి అడ్డంకి కాదు. బలంగా సంకల్పిస్తే వయసు అన్నది జస్ట్ నెంబర్ మాత్రమేనని 60 ఏళ్ల ముసలొళ్లు కూడా ప్రూవ్ చేసారు. ఈ నేపథ్యంలో పవన్ గట్టిగా అనుకుంటే సిక్స్ ప్యాక్ ట్రాన్స్ పర్మేషన్ పెద్ద విషయం కాదు.