పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని చూసేందుకు, ఆయనతో మాట్లాడి ఫోటో దిగేందుకు అభిమానులే కాదు చిన్న నటులు సైతం ఏంతో ఉత్సాహపడిపోతారు. తాజాగా ఓ కుర్ర హీరో ప్రభాస్ గారి హగ్ చూసి చాలా జెలస్ ఫీలయ్యాడట. అదే రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ తో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ తో ప్రభాస్ ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయ్యిందో అందులో సంతోష్ శోభన్ ను ప్రభాస్ హగ్ చేసుకోవడం అంతే హైలెట్ అయ్యింది.
శోభన్ ఫ్యామిలీ తో ప్రభాస్ కి ఎంతో అనుబంధం ఉంది. సంతోష్ శోభన్ సినిమా కానీ, లేదంటే సంగీత్ శోభన్ సినిమాలు కానీ రిలీజ్ అవుతున్నాయంటే ప్రభాస్ ఖచ్చితంగా మాట సహాయమో లేదంటే ఏదైనా సహాయం చెయ్యకుండా ఉండరు. కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ కి ముందు ప్రభాస్ ఇన్వాల్వ్ అవ్వకపోయినా సినిమా విడుదలై సక్సెస్ అయ్యాక సంతోష్ శోభన్-మానస వారణాసి లతో ప్రభాస్ ఇంటర్వ్యూ చేసాడు.
తాజాగా సంతోష్ తమ్ముడు హీరో సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్ర ఈవెంట్ లో జర్నలిస్ట్ లు మీ సినిమాకి కూడా ప్రభాస్ తో ప్రమోషన్ చేయిస్తారా, ఆయన హగ్ ఇస్తే ఎలా ఫీలవుతారు అనగానే.. సంగీత్ మట్లాడుతూ.. సంతోష్ శోభన్‌కు ఇచ్చిన ప్రభాస్ గారి హగ్ చూసి నాను చాలా జెలసీ ఫీల్ అయ్యాను... అది నేను మర్చిపోలేను.
ప్రభాస్ గారు హగ్ నే కాదు ఆయన దొరికితే అస్సలు వదలను అంటూ సరదాగా కామెంట్స్ చేసాడు