బాలీవుడ్ లో పెద్ద సినిమా అయినా..చిన్న సినిమా అయినా? కచ్చితంగా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అది హిట్ సినిమా అయినా అంతే ..ప్లాప్ అయిన సినిమా అయినా అదే పద్దతిలో రిలీజ్ అవుతుంది. 70 శాతం రెవెన్యూ అన్నది థియేటర్ల నుంచే వస్తుంది. అక్కడ ఎగ్జిబిటర్లు వేరు. నిర్మాతలు వేరు కాబట్టి ఈ నిబంధన తప్పక అమలులో ఉంటుంది. ఈ రూల్ బ్రేక్ చేసి నిర్మాత సినిమా రిలీజ్ చేద్దామని చూస్తే మల్లీప్లెక్స్ థియేటర్లు ఇవ్వవు. ఆ ప్రభావం అక్కడితో ఆగదు. తర్వాత సినిమాలపైనా పడుతుంది.
ఇలా కఠినమైన కొన్ని నిర్ణయాలు బాలీవుడ్ లో ఉన్నాయి కాబట్టే ఓటీటీ లో సినిమా రిలీజ్ అన్నది కచ్చితంగా ఎనిమిది వారాల తర్వాత జరుగుతుంది. కానీ టాలీవుడ్ లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు..డిస్ట్రిబ్యూటర్లు అంతా ఒక్కరిగానే ఉంటారు. ఒకప్పటి థియేటర్ వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఇప్పుడు వ్యవస్థ ఉంది. పాత రోజుల్లో ఎగ్జిబిటర్, నిర్మాత వేరుగా ఉండేవారు. దీంతో సినిమా రిలీజ్ అన్నది సక్రమంగా జరిగేది. కానీ ఇప్పుడు నిర్మాతలే థియేటర్ల ఓనర్లగా మారడంతో? అన్ని వాళ్ల చేతుల్లో పనులుగా మారిపోయాయి.
ఏషియన్ సినిమాస్, ఎస్వీసీ సినిమాస్, మైత్రీ థియేటర్స్ ,యూవీ సెల్యులాయిడ్ వాళ్లే ఎగ్జిబిటర్ల గా ,నిర్మాతలుగా ఉన్నారు. కొత్త సినిమా రిలీజ్ అయి థియేటర్లో హిట్ టాక్ వచ్చిందంటే కొన్ని రోజుల పాటు థియేటర్లో ఆడుతుంది. అదే ప్లాప్ టాక్ వచ్చిందంటే? మూడు నాలుగు రోజుల్లోనే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్ పరంగా వచ్చే నష్టాలను ఓటీటీ రూపంలో భర్తీ చేసుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. ఓటీటీ రిలీజ్ అన్నది మూడు నాలుగు వారల్లో జరిగితే భారీ మొత్తాన్ని ఆపర్ చేస్తాయి. లేదంటే? తక్కువగా ఆఫర్ చేసి డీల్ క్లోజ్ చేస్తుంటాయి. అందుకే తెలుగు నిర్మాతలు ఓటీటీల విషయంలో సున్నితంగా వ్యవహరిస్తుంటారు.