మూడు రోజుల క్రితం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఉదయపూర్ నుంచి ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ కి వచ్చారు. కొత్త కోడలు రష్మికకు సాదర ఆహ్వానం పలికింది దేవరకొండ ఫ్యామిలీ. ఇక ఈరోజు కొత్త జంట రష్మిక-విజయ్ దేవరకొండ లు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు.
ఈరోజు ఆదివారం తెల్లవారు ఝామున సుప్రబాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు అందుకున్నారు. కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికలు సంప్రదాయమైన దుస్తుల్లో వెంటకేశ్వరుని దర్శనం చేసుకున్నారు. కొత్త పెళ్లి కూతురు రష్మిక చీర కట్టులో అందంగా మెరిసింది. అక్కడ దేవస్థానం ప్రాంగణంలో కొత్త జంట తమ వివాహం సందర్భంగా స్వీట్స్ పంచిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్‌పేటలో ఈరోజు విందు ఏర్పాటు చేసారు. ఆతరవాత మార్చి 4 అంటే బుధవారం సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణ లో విజయ్ దేవరకొండ-రష్మిక ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకకు సినీ, రాజకీయనాయకులు హాజరు కానున్నారు.