`స్పిరిట్` సినిమా కోసం హీరో ప్రభాస్-డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్య ఓ అగ్రిమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. `స్పిరిట్` షూటింగ్ కి ప్రభాస్ హాజరైనంత కాలం మరో సినిమా చేయకూడదు అన్నది సందీప్ కండీషన్. అలా చేస్తే తన సినిమా డిస్టర్బ్ వుతుందని...తాను అనుకున్న విధంగా హీరో పాత్ర పండదు అన్నది వంగా అభిప్రాయం. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా తప్పకుండా డార్లింగ్ అటూ తన కండీషన్ కు ఒప్పుకున్నాడు.
దాన్ని ప్రభాస్ పెద్ద సమస్యగానూ భావించలేదు. కానీ ఇప్పుడు జరుగుతోంది? ఏంటి అంటే సందీప్ చెప్పినట్లు ఏదీ `స్పిరిట్` షూటింగ్ విషయంలో జరగలేదు. ప్రభాస్ `స్పిరిట్` షూటింగ్ తో పాటు `పౌజీ` షూటింగ్ కూడా హాజరవుతున్నాడు. వచ్చే నెలలో `కల్కి 2` షూటింగ్ కూడా మొదలవుతుంది. దీంతో ఆ సినిమా షూట్ కి కూడా డార్లింగ్ అటెండ్ అవుతాడు. అంటే ఎవరు ఎవరి దారిలోకి వచ్చినట్లు? అంటే ప్రభాస్ రూట్లోకే సందీప్ వచ్చాడనిపిస్తుంది.
అయితే ఇలా ఎంతో కాలం కాదు లేండి. `పౌజీ` ఇప్పటికే క్లైమాక్స్ చేరుకుంది. ప్రభాస్ మరికొన్ని రోజులు హాజరైతే? పూర్తవుతుంది. అనంతరం `స్పిరిట్` షూటింగ్ పైనే పూర్తి ఫోకస్ తో పని చేస్తాడు. మరి` కల్కి 2` సంగతేంటి? అంటే మార్చి నుంచి మొదలవుతుందన్నది కేవలం ప్రచారం మాత్రమే. మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ప్రభాస్ అటెండ్ అయినా? చిన్న చిన్న సీన్స్ తప్ప హార్డ్ సీన్స్ ఏవీ తెరకెక్కించరు.
ఎందుకంటే స్పిరిట్ సెట్స్ లో ఉండగా `కల్కి 2` లో బలమైన సీన్స్ చేయడానికి వీలుండదు. లుక్ పరంగానూ డార్లింగ్ మార్పులు చేయాల్సి ఉంటుంది. భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి నేరుగా ప్రభాస్ పైనే కీలక సన్నివేశాలు మొదలు పెట్టరు. ముందుగా కొంత భాగం కీలక నటులపై చిత్రీకరిస్తారు. అటుపై ప్రభాస్ మెల్లగా టీమ్ తో జాయిన్ అవుతాడు.