Advertisement
Google Ads BL

భార్య-కొడుకుల షాక్ కి విజయ్ విలవిలా


సినిమా హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని బిందాస్ గా లైఫ్ ని ఎంజాయ్ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాడు విజయ్. విజయ్ ని ఎలాగైనా పారిపోయేలా చెయ్యడానికి బిజెపి అన్ని వైపుల నుంచి విజయ్ కి పొగ పెడుతుంది. ఇప్పటికే కరూర్ తొక్కిసలాట ఘటన తో సతమతమైన విజయ్ కి జన నాయకన్ విడుదల పెద్ద సవాల్ గా మారింది.

Advertisement
CJ Advs

ఈలోపు భార్య సంగీత విడాకులు నోటీసులు ఇచ్చి విజయ్ పొలిటికల్ కెరీర్ ని డ్యామేజ్ చేసింది. వేరే నటి తో సంబంధాలున్న తన భర్త విజయ్ వలన తాను గత రెండేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను, నాకు విడాకులు ఇప్పించమని సంగీత కోర్టుకు వెళ్ళింది. ఈ కేసులో విజయ్ ఏప్రిల్ 20 న విచారణకు రావాలని కోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఈలోపు కొడుకు జాసన్ విజయ్.. తండ్రి విజయ్ కు షాకిచ్చినట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎందుకంటే తండ్రి విజయ్ ను జాసన్ ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసాడనే వార్త దావాలనంలా వ్యాపించింది. ఈ విషయంలో క్లారిటీ లేదు.. కారణం విజయ్ ను ఇప్పటివరకు జాసన్ ఫాలో అవలేదని కొందరు, కాదు ఇప్పుడు అన్ ఫాలో చేసాడు అని కొందరు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా విజయ్ కు అటు భార్య ఇటు కొడుకు ఒకేసారి షాకివ్వడం మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. 

Did Jason Sanjay unfollow his dad Vijay :

Did Jason Sanjay unfollow his dad Vijay amid divorce from mom Sangeeta 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs