బాలీవుడ్ లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ చిత్రం థియేటర్స్ లో విడుదలై నార్త్ లోనే ప్రభంజనం సృష్టిస్తే.. నెట్ ఫ్లిక్స్ నుంచి విడుదలై పాన్ ఇండియా భాషల్లో అంతకుమించి రికార్డ్స్ సృష్టించింది. అయితే ధురంధర్ చిత్ర నిడివి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 3గంటల నిడివితో ధురంధర్ థియేటర్స్ లో విడుదలైంది.
థియేటర్స్ లో కానీ ఓటీటీ లో చూసిన వారు కానీ ధురంధర్ నిడివి విషయమై ఎలాంటి కంప్లైంట్ చెయ్యలేదు. అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు అన్నారు. ఇప్పుడు ధురంధర్ ద రివెంజ్ కి కూడా మేకర్స్ ధురంధర్ 1 కన్నా ఎక్కువ నిడివి ఉంచారట. దురంధర్ పార్ట్ 1 కి మించి పార్ట్ 2 నిడివి ఉండబోతుంది అనే టాక్ వైరల్ అవుతోంది.
దాదాపు నాలుగు గంటల నిడివితో ధురంధర్ మేకర్స్ ధురంధర్ 2 ని సెన్సార్ కి పంపారట. నిర్మాతలు ధురంధర్ 2 నిడివి తగ్గించమని ఎంతగా ఒత్తిడి చేస్తున్నా దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం ససేమిరా అంటున్నారట. నాలుగు గంటలు కాకపోయినా అటు ఇటుగా మూడున్నర గంటల పైనే ధురంధర్ 2 నిడివి ఉంటుంది అంటున్నారు.
మరి కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటలేం ఖర్మ ప్రేక్షకులు నాలుగు గంటలైనా థియేటర్లు లో స్పెండ్ చేస్తారు.