Advertisement
Google Ads BL

విజ‌య్ - ర‌ష్మిక‌ల హ‌నీమూన్ స్పాట్ ఇదేనా


విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మికా మంద‌న్నా మూడు ముళ్ల బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేసారు. ప్రేమ అనే బంధానికి పెళ్లితో ముగింపు ప‌లికారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా  వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేప‌థ్యంలో  అందరి కళ్లు త‌దుప‌రి క్ర‌తువుపైనే ప‌డ్డాయి. హ‌నీమూన్ ఏ దేశంలో ప్లాన్ చేస్తున్నార‌నే0 చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Advertisement
CJ Advs

ఈ క్రేజీ కపుల్  హనీమూన్ కోసం జపాన్  దేశాన్ని ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే విజయ్ - రష్మిక ల‌కు  జపాన్ సంస్కృతి, అక్కడి వాతావరణం అంటే ఎంతో ఇష్టం. గతంలో కూడా వీరు రహస్యంగా జపాన్ పర్యటనకు వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తమ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా అక్కడి నుండే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారన్న‌ది ఓ వెర్ష‌న్.

అలాగే ప్రశాంతమైన మాల్దీవుల బీచ్ రిసార్ట్స్‌ని కూడా వీరు ఒక ఆప్షన్‌గా పెట్టుకున్నారు అన్న‌ది మ‌రో వెర్ష‌న్. వీరిద్ద‌రు మాల్దీవుల్లో దిగిన ఫోటో షూట్ అప్ప‌ట్లో నెట్టింట ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఇద్ద‌రు రిలేష‌న్ షిప్ లో ఉన్నారా? అని అప్ప‌టి నుంచే మీడియాలో క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కాయి. అప్ప‌టి వ‌ర‌కూ వ్య‌వ‌హారం గోప్యంగా ఉన్నా? అప్ప‌టి నుంచి ప‌బ్లిక్ గా మారింది.

కానీ ఆ ప్ర‌చారాన్ని విజ‌య్ -ర‌ష్మిక‌లు ఖండించారు. అయినా ప్ర‌చారం మాత్రం ఆగ‌లేదు. ఇద్ద‌రు ఎక్క‌డ తార‌స ప‌డినా?  సోష‌ల్ మీడియాలో  ఓ సంచ‌ల‌నంగా మారేది.  కానీ నేటి నుంచి అలాంటి సంచ‌ల‌నానికి తావు లేదు. ఇక‌పై వ్య‌వ‌హార‌మంతా అధికార‌క‌మే.

Vijay Deverakonda-Rashmika Mandanna:

Vijay Deverakonda-Rashmika Mandanna Honeymoon 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs