Advertisement
Google Ads BL

ఉస్తాద్ భగత్ సింగ్ కి దిమ్మతిరిగే ఓటీటీ డీల్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ రాక కు మరొక్క నెల మాత్రమే సమయముంది. మార్చ్ 26 న రాబోతున్న ఉస్తాద్ భగత్ పై హైప్ లేదు, దర్శకుడు హరీష్ శంకర్ ఊపునిచ్చే ప్రమోషనల్ కంటెంట్ వదలాలి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్న సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ కి అదిరిపోయే ఓటీటీ డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కి దిమ్మతిరిగే డీల్ పెట్టిందట. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్ కట్ చూడడమే కాదు సినిమా మొత్తంలో 20 నిమిషాల ఫుటేజ్ చూసిన నెట్ ఫ్లిక్స్ టీమ్ ఫుల్ గా శాటిస్ఫాయ్ అయ్యి ఏకంగా 80 కోట్ల డీల్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులు దక్కనుంచుకున్నట్టుగా టాక్.

మరి తెలుగు భాషకు మాత్రమే కాదు నెట్ ఫ్లిక్స్ మిగతా పాన్ ఇండియా లాంగ్వేజెస్ కి కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులను ఈ భారీ డీల్ తో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తున్నారు. 

Ustaad Bhagat Singh gets a shocking OTT deal:

Big OTT Deal for Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs