పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. దానికి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కల్కి విడుదలైన రెండేళ్లకు కల్కి 2 ని నాగ్ అశ్విన్ పట్టాలెక్కించారు. ప్రస్తుతం కల్కి 2 అమితాబచ్చన్, ఇంకా విలన్ పాత్రధారి కమల్ హాసన్ లపై నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కల్కి 2 షూటింగ్ చాలా స్పీడు గా జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే కాల్ షీట్ టైమ్ అని మాది కట్టుకుని కూర్చోకుండా అవసరం అయితే రాత్రి 9 గంటల వరకు కూడా అమితాబ్-కమల్ కల్కి 2 షూట్ చేస్తున్నారు అని తెలుస్తుంది
నిజంగా ఈ వయసులో కూడా వాళ్ళ డెడికేషన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అంటూ చిత్ర బృందం చెబుతున్న మాట. అయితే ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ అలాగే ఫౌజీ షూట్ లో ఉన్నారు. ఇంకా కల్కి 2 సెట్ లోకి ప్రభాస్ ఎంటర్ అవ్వలేదు.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ వచ్చే నెల 12 వరకు జరుగుతుంది అని సమాచారం.