Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ కి కొడుకుగా క్రేజీ స్టార్


ఈమధ్యన మలయాళ హీరోలు ఇతర భాషల స్టార్ హీరోస్ సినిమాల్లో నటించేందుకు ఎలాంటి ఆలోచన చెయ్యడం లేదు, వెనకడుగు వెయ్యడం లేదు. ఫహద్ ఫాసిల్ కమల్ తోనూ, రజిని తోనూ నటించారు. ఇప్పుడు మరో మళయాళ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఆయనకు కొడుకుగా కనిపించబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం జైలర్ 2 లో నటిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ అతి త్వరలోనే శిబి చక్రవర్తి అనే యువ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నారు. కమల్ హాసన్ నిర్మించే ఈ చిత్రంలో రజినికాంత్-కమల్ కలిసి నటిస్తున్నారు. ఈచిత్రంలో సూపర్ స్టార్ కి కొడుకుగా మలయాళ కుర్ర హీరో కమ్ డైరెక్టర్ నటిస్తున్నాడట.

అతనే జయ జయ జయ జయహే, సూక్ష్మదర్శిని చిత్రాలతో అన్ని భాషలకు పరిచయమై క్రేజీగా ఫేమస్ అయిన బాసిల్ జోసెఫ్ సూపర్ స్టార్ కొడుకుగా దర్శకుడు తీసుకురాబోతున్నారట. సో బాసిల్ జోసెఫ్ ఒప్పుకున్నాడంటే ఈప్రాజెక్టు పై అంచనాలు మరింతగా పెంచుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో OG గర్ల్ ప్రియాంక మోహన్ కూడా కనిపించబోతుంది. 

Basil Joseph in Rajinikanth next:

Basil Joseph to play Rajinikanth son in Cibi Chakaravarthi film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs