సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో రూ.300 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరోసారి రూ.350 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టారు. మన శంకర వరప్రసాద్ గారు లో గెస్ట్ రోల్ చేసిన వెంకీ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ మలయాళ హిట్ సీరీస్ దృశ్యం 3 చేస్తారనుకున్నారు.
మలయాళంలో దర్శకుడు జీతూ జోసెఫ్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిస్తున్న దృశ్యం 3 మరొక్క నెలలో విడుదలకాబోతుంది. ఈ చిత్రాన్ని వెంకీ రీమేక్ చేస్తారని అనుకున్నారు కాదు అన్నారు కూడా. కానీ ఇప్పుడు వెంకటేష్ ఆదర్శ కుటుంబం తర్వాత అనిల్ రావిపూడి తోనే సినిమా చెయ్యాలనుకుంటున్నారట. సో దృశ్యం రీమేక్ వెంకీ చెయ్యరనే టాక్ వినిపిస్తుంటే.. వెంకీ రీమేక్ చేయకపోవడమే బెటర్ అంటున్నారు అభిమానులు.
దృశ్యం 3 మలయాళ వెర్షన్ ఏప్రిల్ లో విడుదలైతే దానిని మలయాళంలో అయినా ఓటీటీ కి వచ్చేస్తే చూసేస్తారు. సో దానిని రీమేక్ చేసినా వర్కౌట్ అవ్వదు, అటు వెంకీ కూడా ఇదే ఆలోచిస్తున్నారట. బడ్జెట్ పెట్టి థియేట్రికల్ రిలీజ్ అవసరమా అని, మరోపక్క బాలీవుడ్ లో అజయ్ దేవగన్ దృశ్యం 3 ని కొత్త కథ తో చేస్తున్నారనే టాక్ ఉంది.
మరి నిజంగా వెంకటేష్ దృశ్యం 2 రీమేక్ వదిలేసి మంచి పని చేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.