రేపు గురువారం ఉదయం హీరో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ ముస్తాబైంది. విజయ్ దేవరకొండ-రష్మిల పెళ్లి కోసం తరుణ్ భాస్కర్, ఈష రెబ్బ, సందీప్ రెడ్డి వంగ ఇంకా కొద్దిమంది క్లోజ్ పీపుల్ ఉదయపూర్ కి చేరుకున్నారు. అలాగే విజయ్-రష్మిక ల తెలుగు సంప్రదాయం వివాహం కోసం పూజారులు కూడా హైదరాబాద్ నుంచి ఉదయపూర్ బయలుదేరి వెళ్లారు.
ఈరోజు విజయ్ దేవరకొండ-రశ్మికల హల్దీ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఎల్లో డ్రెస్ కోడ్ లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ఇలా పలువురు సెలబ్రిటీస్ విజయ్-రశ్మిక ల హల్దీ సెర్మోని లో పాల్గొనేందుకు రెడీ అయిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ-రష్మిక ల వివాహం రేపు ఫిబ్రవరి 26 ఉదయం తెలుగు సంప్రదాయంలోనూ, సాయంత్రం రష్మిక ఫ్యామిలీ కోసం కొడవ సంప్రదాయంలో విజయ్, రష్మిక వివాహం చేసుకోనున్నారు. మార్చ్ 4 న విజయ్ దేవరకొండ-రష్మిక ల వెడ్డింగ్ రిసెప్షన్ కి హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదిక కానుంది. ఈ వేడుకకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం.