కేజిఎఫ్ తర్వాత యష్ నుంచి రాబోతున్న చిత్రం టాక్సిక్. మార్చ్ 19 న భారీ అంచనాలతో పాన్ ఇండియా మార్కెట్ లో దిగుతున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో పిచ్చ క్యూరియాసిటీ నడుస్తుంది. అదే రోజు రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 రావడమే. టాక్సిక్ vs ధురంధర్ ద రివెంజ్.. ఈ రెండిటిలో దేనికి క్రేజ్ ఎక్కువ ఉంది అంటే ఇప్పటికైతే ధురంధర్ 2 కే అని చెప్పాలి.
టాక్సిక్ నుంచి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ గనక భీబత్సంగా ఆకట్టుకుంటే టాక్సిక్ పై ఇప్పుడు ఉన్న అంచనాలు రెట్టింపు అవుతాయి. అటు చూస్తే ధురంధర్ 2 కోసం పాన్ ఇండియా ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. దానికి ప్రమోషన్స్ కూడా అక్కర్లేనంత క్రేజ్ ఉంది. మరి టాక్సిక్ ఓపినింగ్స్ విషయంలో అందరిలో ఎక్కడో చిన్న అనుమానం.
యష్ కేజిఎఫ్ క్రేజ్ ని చూపెడతాడా, లేదంటే ధురంధర్ 2 ముందు తల వంచుతాడా అనేది మార్చి 19 న తేలినా.. ఇప్పుడైతే అన్ని వైపుల నుంచి ధురంధర్ 2 పైనే హైప్, క్రేజ్ కనిపిస్తున్నాయి.