Advertisement
Google Ads BL

అక్షయ్ సలహా ధైర్యాన్ని నింపింది-మృణాల్


క్రేజీ అండ్ టాప్ హీరోయిన్స్ కూడా అంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వరేమో.. మృణాల్ ఠాకూర్ కొన్నిరోజులుగా అంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ధనుష్ తో ప్రేమ వ్యవహారం, ధనుష్ తో పెళ్లి, అలాగే పలు సినిమాల ఆఫర్స్ విషయంలో మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా మృణాల్ ఠాకూర్ తన శరీరాకృతి విషయంలో సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తనెంతగా మానసికంగా నలిగిపోయిందో  చెప్పుకొచ్చింది. తన వెయిట్ పై సోషల్ మీడియా ట్రోల్స్ చూసి మధనపడేదాన్ని అని, బాడీ షేమింగ్ ట్రోల్స్ పై మానసిక సంఘర్షణకు లోనయ్యాను అని.. కానీ ఆతర్వాత నాలో వచ్చిన మార్పు, అక్షయ్ కుమార్ సలహా నాలోని ఆత్మవిశ్వసాన్ని పెంచాయని చెప్పింది.

ఒకప్పుడు మృణాల్ ఠాకూర్ బబ్లీగా ఉండేది, అలాగే ఛామన ఛాయతో కనిపించేది. దానితో ఈమె హీరోయిన్ ఏమిట్రా బాబు అనుకునేవారు. ఆ సమయంలో మృణాల్ ఎంతగా ఏడ్చిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన మొహాన్ని గుర్తు చేసుకుంది. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను ఎత్తి పొడిచేవారు. 

మొదట్లో ఎంతబాధపడినా తర్వాత రియలైజ్ అయ్యాను. మనం మనలా ఉండాలని, మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతామని. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎవరేమనుకుంటారో అనేది మనకి అనవసరం. అదే మాట అక్షయ్ కుమార్ కూడా  చెప్పారు. ట్రోల్స్ ని పట్టించుకోవద్దు. ఎవరేమనుకుంటారో అనేది వదిలెయ్యండి. సినిమాలోని పాత్రాలు డిమాండ్ చేస్తేనే బరువు తగ్గాలని అక్షయ్ సూచించారు.

నిజంగా ఆయన సూచన, సలహా నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపాయి అంటూ మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Mrunal Thakur on her struggle with body shaming:

Mrunal Thakur reveals Akshay Kumar advice that helped her overcome body
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs