సమంత హీరో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకుని, ఆతర్వాత విడాకులు తీసుకుంది. అప్పట్లో నాగ చైతన్య ను వదులుకున్నందుకు అందరూ సమంత నే దెప్పి పొడిచారు, సోషల్ మీడియాలోనూ సమంత ను భారీగా ట్రోల్ చేసారు. ఆతర్వాత సమంత హెల్త్ విషయంలో సఫర్ అయ్యి కోలుకుని రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకుంది.
సమంత రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకున్నప్పటికీ ఆమెను ఎవ్వరూ ఏమి అనలేదు, కానీ తాజాగా సమంత ఓ ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లి, ప్రేమ గురించి మాట్లాడడం ఆమెను మరోసారి ట్రోల్ చేసేలా చేసింది. మొదటి వివాహ బంధం బ్రేక్ అయ్యాక చాలా మధనపడిన తను, తనని తాను ప్రేమించుకోవడం నేర్చుకున్నట్టుగా, ఉదయం సూర్యుణ్ణి ఎక్కువ సేపు చూడడం, యోగ చెయ్యడం దినచర్యగా మార్చుకున్నాను అని, రాజ్ నిడిమోరు దొరికాక నిజమైన ప్రేమ దొరికినట్లుగా ఫీలయినట్లుగా సమంత చెప్పుకొచ్చింది.
ఇప్పుడు రాజ్ నిడిమోరు తో తనకి మళ్లీ ప్రేమ దొరికేది అని, రాజ్ నిడిమోరు తో కలసి అన్ని పనులు చేసుకుంటున్నట్టుగా చెప్పడం చాలామందికి నచ్ఛలేదు. రెండో బంధం ప్రేమ గురించి చెబుతూ మొదటి బంధాన్ని సమంత నెగిటివ్ గా చూపించింది అంటూ చాలామంది సమంత ను ట్రోల్ చేస్తున్నారు.