సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం వారణాసి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జార్జియా లో జరుగుతుంది. మహేష్ బాబు, అలాగే మందాకినీ పాత్రధారి ప్రియాంక చోప్రా, విలన్ పాత్రధారి కుంభ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా కీలక నటులపై రాజమౌళి ఓ కీ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు.
దానికోసం మహేష్ బాబు హైదరాబాద్ నుంచి జార్జియా కి బయలు దేరారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ జార్జియా వెళ్లేందుకు రాగా.. మహేష్ కి సెండాఫ్ ఇచ్చేందుకు భార్య నమ్రత, అలాగే కుమార్తె సితారలు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. నమ్రత, సితార లు మహేష్ కి సెండాఫ్ ఇచ్చిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జార్జియా లో రాజమౌళి పలు లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది అని సమాచారం.