కాంతార 2 తో పాన్ ఇండియా ప్రేక్షకులను కట్టిపడేసిన కన్నడ భామ రుక్మిణి వసంత్ మరొక్క నెలలో అంటే మార్చ్ 19 న కన్నడ స్టార్ హీరో యష్ కలిసి టాక్సిక్ మూవీ పాన్ ఇండియా మార్కెట్ లోకి రాబోతుంది. వరసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని ఒడిసిపట్టుకున్న రుక్మిణి వసంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ లో నటిస్తుంది.
రీసెంట్ గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకలో గ్లామర్ గా కనిపించిన రుక్మిణి లేటెస్ట్ లుక్ ని యూత్ బాగా ఎంజాయ్ చేసింది. తాజాగా రుక్మిణి వసంత్ క్లాసీ లుక్ లో మత్తెకించింది. బ్లాక్ షర్ట్, చెక్స్ స్కర్ట్, బ్లాక్ షూ లో రుక్మిణి వసంత్ స్టైలిష్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్-రుక్మిణి కలిసి కనిపించే క్షణం కోసం పాన్ ఇండియా ఆడియన్స్ కన్నా ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరా తరుణం ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి.