Advertisement
Google Ads BL

ప్రభాస్-ఫ్లైట్‌లో చెన్నై నుంచి ముంబైకి ఫుడ్


ఒక ఫ్లాప్ డైరెక్ట‌ర్ కోసం డార్లింగ్ ప్ర‌భాస్ చేసిన సాహ‌సం అంతా ఇంతా కాదు. అత‌డి కోసం డార్లింగ్ ఏకంగా చెన్నై నుంచి ముంబైకి బిరియానీ తెప్పించాడు. రెగ్యుల‌ర్ ముంబై స్టైల్ ఫుడ్ వ‌ద్దు.. నీ కోసం స్పెషల్ వ‌స్తోంది అంటూ ఏకంగా చెన్నై నుంచి ఫ్లైట్ లో ఫుడ్ ర‌ప్పించాడు. చెన్నైలో ఫేమ‌స్ రెస్టారెంట్ లో పాయ, బిరియానీ ట‌మోటా ఫ్లేవ‌ర్ తో అదిరిపోతుంది. రెగ్యుల‌ర్ హైద‌రాబాదీ బిరియానీ కంటే అది ఇంకా స్పెష‌ల్. అందుకే ప్ర‌భాస్ ఈ ప‌ని చేసాడు.

Advertisement
CJ Advs

ఇంత‌కీ ఈ స్పెష‌ల్ ఫుడ్ తిన్న‌ది ఎవ‌రో తెలుసా?  ఆదిపురుష్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్. ఇప్పుడు మీకు కోపం రావొచ్చేమో కానీ, ఆదిపురుష్ షూటింగ్ స‌మ‌యంలో ఓంరౌత్ గొప్ప పేరున్న ద‌ర్శ‌కుడు. అత‌డు అప్ప‌టికే తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీసాడు. ఆ సినిమా కోసం అత‌డు సాంకేతికంగా అద్భుత ప‌నిత‌నం క‌న‌బ‌రిచాడు. కానీ ఆదిపురుష్ లాంటి డిజాస్ట‌ర్ ని ప్ర‌భాస్ కి ఇచ్చాడు. రామాయ‌ణం లాంటి పురాణేతిహాస క‌థ‌ను ఖూనీ చేసాడ‌ని తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నాడు. 

క‌నీసం ఇందులో ఆంజ‌నేయుడు లేదా వాన‌రాల రూపాన్ని కూడా అత‌డు య‌థాత‌థంగా లేకుండా మార్చేసాడు. `ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` అనే హాలీవుడ్ సినిమా నుంచి ఏకంగా చింపాజీల‌ను కాపీ చేసాడు. ఒక అంద‌మైన దృశ్య కావ్యంలా చిత్రీక‌రించాల్సిన ఈ సినిమాలో పాత్ర‌ధారుల లుక్ తో పాటు చాలా విష‌యాల‌ను మార్చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. మొత్తానికి బిరియానీలు పాయ, తిని అత‌డు అలా మారాడు.  

Prabhas Wanted Chennai Food In Mumbai:

Prabhas flew down lunchboxes of food from Chennai to Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs