సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ కోసం ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను ఎంపిక చేసి తర్వాత రిజెక్ట్ చేసి సెన్సేషన్ సృష్టించాడు, దీపికా స్థానంలోకి యానిమల్ సెకండ్ హీరోయిన్ త్రిప్తి డుమ్రి ని స్పిరిట్ హీరోయిన్ గా ఎంపిక చేసారు. దానితో త్రిప్తి డుమ్రి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.
సోషల్ మీడియాలో త్రిప్తి డుమ్రి ఫొటోస్ చూడగానే ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో వైరల్ చేసి పడేస్తున్నారు. అయితే ఇప్పుడు త్రిప్తి డుమ్రి కి తెలుగులో స్పిరిట్ మూవీ మాత్రమే కాకుండా మరో టాలీవుడ్ హీరో తో ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. అదే నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రం చేస్తున్న నాని తన తదుపరి మూవీ కోసం..
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ త్రిప్తి డుమ్రి ని నాని నెక్స్ట్ కోసం అనుకుంటున్నారట. ఈ హీరోయిన్ బాలీవుడ్ కి చెందడంతో పాన్ ఇండియా మార్కెట్ కి సెట్ అవుతుంది అని నాని ఆలోచనట. మరి నాని సినిమాలో త్రిప్తి డుమ్రి మెయిన్ హీరోయిన్ గా కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.