రామ్ చరణ్-బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న విడుదకు సిద్దమవుతుంది. బుచ్చిబాబు పెద్ది షూటింగ్ ఫినిష్ చేసే పనిలో డే అండ్ నైట్ పని చేస్తున్నాడు. ప్రస్తుతం పెద్ది చిత్రం పై విపరీతమైన అంచనాలున్నాయి. పెద్ది ఫస్ట్ షాట్, పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఇక పెద్ది థియేట్రికల్ రైట్స్ కే కాదు పెద్ది డిజిటల్ అండ్ ఆడియో రైట్స్ కి దిమ్మ తిరిగే డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ది చిత్ర డిజిటల్ మరియు ఆడియో రైట్స్ కి కలిపి 133 కోట్ల డీల్ ఫైనల్ అయిట్లుగా టాక్. పెద్ది అన్ని లాంగ్వేజెస్ కి కలిపి ఈ డీల్ అంటే మాములు విషయం కాదు. దీనినిబట్టే పెద్ది పై అంచనాలు ఎంతున్నాయో తెలుస్తుంది.
పెద్ది లో రామ్ చరణ్ సరసన గ్లామర్ భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. శివరాజ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.