ప్రభాస్ కి సలార్ లాంటి భారీ విజయం తర్వాత రూ.1000 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన కల్కి 2898 AD చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ కూడా కల్కి భారీ విజయం సాధించడంతో కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈలోపే ప్రభాస్ రాజాసాబ్ పూర్తి చేసి హను రాఘవపూడి తో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ స్టార్ట్ చేసుకున్నారు.
ఆ రెండు సినిమాలు సెట్ పై ఉన్నాయి.. ఇప్పుడప్పుడే కల్కి సీక్వెల్ ఉండదని అందరూ భావించారు. కానీ ప్రభాస్ కల్కి 2 కోసం డేట్స్ కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి కల్కి 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని లొకేషన్స్ లో కల్కి 2 కోసం భారీ సెట్స్ నిర్మాణంలో ఉన్నాయి.
ప్రభాస్ కూడా కల్కి 2 కోసం రెండు వారాల పాటు డేట్స్ కేటాయించారనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ ఇచ్చిన డేట్స్ లో జరిగే షెడ్యూల్ లో కల్కి లో కీ రోల్స్ పోషించిన అమితాబ్ బచ్చన్, విలన్ పాత్రధారి కమల్ హాసన్ కూడా పాల్గొననున్నారు అని తెలుస్తుంది. కల్కి 2 కి కేటాయించిన 2 వీక్స్ డేట్స్ తర్వాత ప్రభాస్ నిర్విరామంగా ఫౌజీ షూట్ పూర్తి చేస్తారట.
ఎందుకంటే ఫౌజీ చిత్రం దసరా కి రీలాస్ అంటూ మేకర్స్ అనౌన్స్ చెయ్యడంతో ప్రభాస్ ముందు ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కల్కి 2 అలాగే స్పిరిట్ చిత్రాలను ప్రభాస్ ఏక కాలంలో కంప్లీట్ చేస్తారని టాక్.