Advertisement
Google Ads BL

జగన్ కి సాక్షి కి ఇచ్చిపడేసిన నారా లోకేష్


మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక, టివి ఛానల్ సాక్షి ఎప్పుడు కూటమి ప్రభుత్వం పై బురద చల్లేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారా లోకేష్ లను తక్కువ చేసేందుకు ఎన్ని కుట్రలైనా చేస్తుంది. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా యువ మంత్రి నారా లోకేష్ ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వెళ్లారు. ఆదివారం రోజు ఈవెనింగ్ శ్రీలంక స్టేడియం లో ఉన్న నారా లోకేష్.. నెక్స్ట్ డే మార్నింగ్ అమరావతిలో ఉన్నారు. అమరావతిలో నారా లోకేష్ ని చూసిన వారు నారా లోకేష్ డెడికేషన్ ని మెచ్చుకుంటుంటే.. సాక్షి మాత్రం నారా లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. 

సాయంత్రం శ్రీలంకలో కనిపించిన నారా లోకేష్ తెల్లారేసరికి అమరావతికి వచ్చేసాడు, అంటే ఆ ఫ్లైట్ చార్జీలు, జల్సా ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది అంటూ సాక్షినే కాదు వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం నారా లోకేష్ పై దుమ్మెత్తిపోశారు. మరి తనపై బురద చల్లేందుకు ప్రయత్నం చేసిన సాక్షిని నారా లోకేష్ ఎందుకు వదిలేస్తారు. సాక్షికి, జగన్ కి కలిపి సోషల్ మీడియా వేదికగా ఇచ్చిపడేసారు.  

ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను  మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan? #సాక్షి అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ వేసిన ట్వీట్ చూసిన టీడీపీ కార్యకర్తలు సాక్షికి, జగన్ కి భలే ఇచ్చి పడేసావ్ అన్నా అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Nara Lokesh tweet on Jagan:

Nara Lokesh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs