కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్ట్ బిగ్ నిచ్చింది. లైకా ప్రొడక్షన్స్ vs విశాల్ అన్నట్టుగా ఓ వివాదం నడుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ కి చెల్లించాల్సిన డబ్బు విషయంలో విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ బిగ్ ఇచ్చింది. లైకా వారికి చెల్లించాల్సిన డబ్బు ను ఇచ్చేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా దానిని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హీరో విశాల్ హై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. దాని ప్రకారం విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే విశాల్ ఆ రూ.10 కోట్లు లైకా ప్రొడక్షన్స్ కి చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడా విశాల్ కి చుక్కెదురైంది.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.