పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పై కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చేసిన కామెంట్స్ ఎంతగా దుమారాన్ని రేపాయో అందరూ చూసారు. యాడ్ షూట్ లో భాగంగా అల్లు అర్జున్ ని కలవాలంటే 42 కండిషన్స్ కి ఒప్పుకోవాలి, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆయన్ని సర్ అని సంభోదించాలని పబ్లిక్ పాడ్ కాస్ట్ లో చెప్పడంపై అల్లు టీమ్ సీరియస్ అయ్యింది.
కావేరి బరువా అలాగే ఆమెతో పాడ్ కాస్ట్ చేసిన స్వీకృతి పై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్టుగా అల్లు టీమ్ ప్రకటించింది. అటు అల్లు ఫ్యాన్స్ కూడా కావేరి పై మండిపడుతూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో.. ప్రస్తుతం ఈ విషయం సైలెంట్ అయ్యింది.
అలాంటి సమయంలో బారువా అల్లు అర్జున్ కి క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ వదిలింది. అల్లు అర్జున్ విషయంలో తనకు సరిగా ఇన్ఫర్మేషన్ లేదని, అల్లు అర్జున్ పై అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతున్నట్టుగా ఆ నోట్ లో చెప్పుకొచ్చింది. అటు స్వీకృతి కూడా అల్లు అర్జున్ కి బహిరంగ క్షమాపణలు చెప్పింది.