Advertisement
Google Ads BL

ఇళయరాజా కు పెద్ద షాకే తగిలింది


మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందరికి షాక్ ఇవ్వడమే కానీ ఆయనకు షాక్ తగిలిన సందర్భాలు లేవు, ఎవరైనా పర్మిషన్ లేకుండా తన పాటలు వాడుకుంటే వారిపై కేసు వేసి కోర్టుకి వెళ్లి మరీ నష్టపరిహారం ఇప్పించుకుంటారు. తెలిసి వాడినా, తెలియక వాడినా ఇళయరాజా పాటలు తమ సినిమాల్లో వాడినా, లేదంటే తన పర్మిషన్ లేకుండా వాడుకున్నా ఆయనకు చాలా కోపమొస్తుంది. 

Advertisement
CJ Advs

అలాంటి ఇళయరాజా కు ఇప్పుడు గట్టి షాకే తగిలింది. ఆయన అందరిపై కేసులు వెయ్యడం కాదు ఇప్పుడు ఆయనపై సరిగమ సంస్థ కేసు వేసింది. త‌మ ఆధీనంలో ఉన్న వంద‌కు పైగా సినిమాల‌కు సంబంధించిన పాట‌లని ఆయన ఎక్క‌డా వాడుకోవ‌డానికి వీల్లేద‌ని ఇళ‌య‌రాజాపై సరిగమ సంస్థ ఆంక్ష‌లు విధించేలా చేసింది. ఇది నిజంగా ఇళయరాజా కు బిగ్ షాక్ అనే చెప్పాలి.

కొంతమంది నిర్మాతలు తమ ఆడియో హక్కులను సరిగమ కు అమ్మెయ్యగా.. ఇప్పుడు సరిగమ అధీనంలో ఉన్న ఇళయరాజా పాటలను ఆఖరికి ఆయన వాడుకోవాలన్నా సదరు సంస్థ పర్మిషన్ తీసుకోవాలి, ఇళయరాజా ఆ పాటలను ఎవరికీ హక్కులు ఇవ్వకూడదని, అది చెయ్యాలంటే తమ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సరిగమ సంస్థ ఇళయరాజా కు ఝలక్ ఇచ్చింది.

Delhi HC Shock To ilaiyaaraja:

Delhi HC Bars Ilaiyaraaja from Using Saregama Copyrighted Works
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs