Advertisement
Google Ads BL

ధురంధర్ 2 కి కొత్త తలనెప్పి


ధురంధర్ చూసాక ధురంధర్ 2 కోసం వెయిట్ చెయ్యని ఆడియన్స్ వుంటారా.. అందుకే మార్చ్ 19 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ధురంధర్ 2లో రణ్వీర్ సింగ్ కోసం వెయిటింగ్, ఆదిత్య దార్ దర్శకత్వం కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వెయిటింగ్. అయితే మార్చి 19 కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అంతకుమించి ధురంధర్ మేకర్స్ ఆడియన్స్ కి షాకిచ్చారు. 

Advertisement
CJ Advs

మార్చ్ 19 న విడుదల కావాల్సిన ధురంధర్ 2 లోని కొన్ని సన్నివేశాల షూటింగ్ ఇంకా జరుగుతుందట. ఈ సందర్భంలోనే ధురంధర్ 2 టీం కి ముంబై పోలీసులు షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ముంబైలో ఉన్న చారిత్రక ఫోర్ట్ ఏరియాలో ధురంధర్ 2 చిత్రీకరణ కోసం అన్ని అనుమతులు తెచ్చుకుని చిత్రీకరణ చేస్తున్నారట మేకర్స్. కానీ అనుమతులను పక్కనపెట్టి ధురంధర్ లొకేషన్ లో బాణాసంచా కాల్చడం, అలాగే నిప్పు రాజేసి యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడంతో స్థానికులు ఎంసిసికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది.

దానితో ఎంసిసి అధికారులు ధురంధర్ 2 లొకేషన్ లో నిషేదిత వస్తువులను వినియోగించడం నిబంధనల అతిక్రమణే అని.. ధురంధర్ 2 టీమ్ కి ఎంసిసి హెచహరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి విడుదలకు మరో నెల సమయమే ఉంది, ఇలా ఇంకా ధురంధర్ టీమ్  షూటింగ్ చేయడంపై చాలామందిలో చాలా అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. 

BMC blacklists Dhurandhar2:

Dhurandhar 2 in trouble
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs