Advertisement
Google Ads BL

బంగారం - ఇకపై టెన్షన్ అక్కర్లేదు


నిన్నటివరకు గోల్డ్ కొనాలంటే సామాన్యులకు ఒంట్లో ఒణుకు తెప్పించింది బంగారం రేటు. ఒక గ్రాము బంగారం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్తితికి గోల్డ్ రేట్ చేరుకుంది. తులం బంగారం లక్ష అరవై వేలు దాటి వెళ్ళిపోయింది. ఇక సామాన్యుడికి బంగారం అనేది అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయినా.. చాలామంది బంగారం కొని నిల్వచేసారు. బంగారం రేటు పెరిగిపోతుంది, రెండు లక్షలకు వెళ్ళిపోతుంది అంటూ చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసారు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు బంగారం నేల చూపులు చూస్తుంది. కొద్దిరోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఏడెనిమిది నెలలుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర అకస్మాత్తుగా తగ్గడానికి కారణం రష్యా తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం అని తెలుస్తుంది. ఒకప్పుడు డాలర్‌ను బలహీనపరిచేందుకు రష్యా, చైనా వంటి దేశాలు భారీగా బంగారాన్ని నిల్వ చేశాయి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యంలో రష్యా తిరిగి అమెరికా డాలర్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

రష్యా నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ అనూహ్యంగా పెరుగుతోంది. అప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ గోల్డ్ పై పెట్టుబడులను డాలర్ వైపు మళ్లిస్తారు. దానితో బంగారం డిమాండ్ తగ్గుతుంది. ప్రెజెంట్ అదే జరిగింది. 

ప్రస్తుతం బంగారం ధర రూ.1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. లక్షకు చెరువవుతుంది. అప్పటివరకు బంగారం పై ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిన్నవరకు బంగారం విషయంలో టెన్షన్ పడిన సామాన్యుడికి ఇప్పుడు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. 

Gold rate:

Gold price
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs