మృణాల్ ప్రేమ..పెళ్లి విషయంలో నెట్టింట ఏ రేంజ్ లో చర్చ జరిగిందో తెలిసిందే. తొలుత పేరున్న ఓ తెలుగు నటుడినే పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. అటుపై కోలీవుడ్ నటుడు ధనుష్ తో రిలేషన్ షిప్ లో ఉందని..అతడితో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈసారి ప్రచారం మాత్రం పతాక స్థాయిలోనే జరిగింది. ఎంతలా అంటే చివరకు మృణాల్ మీడియా ముందుకొచ్చి ఖండించేంత వరకూ గానీ ప్రచారానికి పుల్ స్టాప్ పడలేదు. పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు అనుకున్న వ్యక్తి కాదంటూ ధనుష్ ను లిస్ట్ లో నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తాజాగా మృణాల్ ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుంది? అన్నది రివీల్ చేసింది.
మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకునే కుర్రాడికి వయసుతో సంబంధం లేదు అంటుంది. అతడు వయసులో తనకన్నా పెద్ద వాడైనా..చిన్నవాడైనా పర్వాలేదంది. తన మనస్తత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తి అయితే చాలు అంది. అతడు అందగాడే కావాల్సిన పనిలేదని..మంచి మనసున్న వ్యక్తి..తనని బాగా చూసుకుంటాడు? అనే నమ్మకం తనకు కలిగినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానంది.
వివాహం తర్వాత జీవితం కూడా ముందులాగే సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అదీ మృణాల్ పెళ్లి సంగతి. ఇక అమ్మడు సినిమాల విషయానికి వస్తే మృణాల్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు , హిందీలో కలిపి నాలుగైదు సినిమాలు చేస్తోంది. ఆ నాలుగు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బన్నీ 22వ చిత్రంలోనూ అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.