గత శుక్రవారం విడుదలైన విశ్వక్ సేన్ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం ఆడియన్స్ ని తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. కేవి అనుదీప్ దర్శకత్వంలో సితార బ్యానర్ పై వచ్చిన విశ్వక్ ఫంకీ కామెడీ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే.. ఆ చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
ఆతర్వాత రోజు ఎలాంటి అంచనాలు లేకుండా యువీ బ్యానర్ నుంచి సంతోష్ శోభన్ - మానస వారణాసి కలయికలో తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లి మూవీ కి ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ వచ్చేసింది. ఫంకీ సినిమా నిరాశపరచడం, మిగతా సినిమాలు సీత పయనం అంతగా ఇంపాక్ట్ చూపించకపోవడం, కపుల్ ఫ్రెండ్లి కి పాజిటివ్ టాక్ రావడం అన్ని ఈ కపుల్ కి కలిసొచ్చింది.
అంతేకాకుండా శివరాత్రి జాగారం కపుల్ ఫ్రెండ్లి కి బాగా హెల్ప్ అయ్యింది, అందుకే కపుల్ ఫ్రెండ్లి థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడాయి. దానితో విశ్వక్ సేన్ ఫంకీ పై కుర్ర హీరో సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లి డామినేషన్ చూపించింది. మరి సోమవారం నుంచి ఈ కపుల్ ఫ్రెండ్లి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.