Advertisement
Google Ads BL

పేదవాడిని అవమానిస్తే హీరో ని చేస్తారు


రీసెంట్ గా జరిగిన మేడారం జాతరలో 10 రూపాయల కోవా బన్ అమ్ముకునే పేద వ్యాపారి షేక్ షావలీ ని కొంతమంది యూట్యూబర్లు ఫుడ్ జిహాద్ అంటూ టార్గెట్ చేసి అవమానించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చిరు వ్యాపారి, రెక్కాడితే కానీ డొక్కాడని షేక్ షావలీ ని యుట్యూబర్స్ మతం రంగు పులిమి వేధించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Advertisement
CJ Advs

షేక్ షావలీ కోవా బన్ వలనే చిన్న పిల్లలకుఆ రోగ్యం చెడిపోతుంది, మీరు తింటారా అంటూ అవమానించిన తీరు చూసి సమస్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు షేక్ షావలీ కి మద్దతు పలుకుతూ సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారు. సామాన్యులు, నెటిజన్లు ఆ యూట్యూబర్ చర్యను తప్పుబడుతూ, షేక్ షావలీ కి మద్దతుగా నిలుస్తున్నారు. 

ఫుడ్ జిహాద్ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన యూట్యూబర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి పేదవాడిని అవమానిస్తే.. సోషల్ మీడియా మద్దతు అతన్ని హీరోని చేసింది. చిన్న, పెద్ద అందరూ షేక్ షావలీ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.

ఇప్పటికే జనసేన ఎమ్యెల్యే నాగబాబు షేక్ షావలీ ని కలిశారు, ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా షేక్ షావలీ ని కలవబోతున్నారనే న్యూస్ చూసి.. పేదవాడిని అవమానిస్తే సమాజం ఊరుకోదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Kova Bun Shaik Shavali:

 Shaik Shavali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs