Advertisement
Google Ads BL

ప్రేయ‌సికి హార్థిక్ ప్రేమ కానుక‌


ఒక‌రు ఎగ్జిట్ అయితే.. ఒక‌రు ఎంట్రీ ఇస్తారు! ఈరోజుల్లో క‌పుల్స్ ప‌రిస్థితి ఇలా మారింది! అయితే న‌టాషా స్టాంకోవిక్ కి విడాకులిచ్చిన హార్థిక్ జీవితంలోకి మ‌రో కొత్త ప్రేయ‌సి వ‌చ్చి చేరిన సంగ‌తి తెలిసిందే. అతడు న‌టి మ‌హీక శ‌ర్మ‌తో క‌లిసి షికార్లు చేస్తుంటే, దానిని క‌వ‌ర్ చేసేందుకు మీడియా ఇటీవ‌ల అదేప‌నిగా వెంటప‌డుతోంది.

Advertisement
CJ Advs

ఎట్ట‌కేల‌కు ప్రేమికుల రోజు (ఫిబ్ర‌వ‌రి 14)ను పుర‌స్కరించుకుని హార్థిక్ త‌న ల‌వ్ లైఫ్‌లో మరో కీలక ముందడుగు వేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలు మహీకా శర్మ  పేరుతో ఒక ప్రత్యేకమైన ట్యాటూ వేయించుకుని త‌న‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఈ ట్యాటూ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ప‌రిశీలిస్తే... దీని రూప‌క‌ల్ప‌న వెన‌క అంత‌రార్థం చాలానే ఉంది. హార్దిక్ పాండ్యా తన మెడ వెనుక భాగంలో ఈ ట్యాటూను వేయించుకున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ట్యాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి దీనిని రూపొందించారు. ఇందులో రెండు చిరుత పులులు ఉన్నాయి. ఒకటి వాస్తవికంగా, గంభీరంగా ఉండి హార్దిక్ బలాన్ని సూచిస్తుంటే, రెండో చిరుత కేవలం సన్నని గీతలతో నీడలా ఉండి మహీకాను సూచిస్తుంది. ఈ రెండో చిరుత పులి ఆకారం మహీకా పేరులోని మొదటి అక్షరం M లాగా కనిపిస్తుంది. నిజానికి ఈ ట్యాటూలో చాలా సందేశం దాగి ఉంది. ఒంటరిగా శక్తివంతులు.. జంటగా తిరుగులేని వారు! అనే అర్థాన్ని ఇస్తుంది. మొదట కేవలం M అక్షరం మాత్రమే వేయించుకోవాలనుకున్న హార్దిక్, ఆర్టిస్ట్‌తో చర్చించిన తర్వాత దీనిని ఒక కళాఖండంగా మార్చారట‌.

మ‌హీక‌తో హార్థిక్ అనుబంధం గురించి ప‌రిశీలిస్తే.. అక్టోబర్ 2025లో మహియెకా శర్మతో తన సంబంధాన్ని అత‌డు అధికారికంగా ప్రకటించారు. 24 ఏళ్ల మోడ‌ల్ కం న‌టి  సర్టిఫైడ్ యోగా ట్రైనర్ కూడా. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల తర్వాత మ‌హీకా రాకతో చాలా సానుకూల మార్పులు వచ్చాయని హార్థిక్ స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేసి 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`గా నిలిచారు. రేపు (ఫిబ్రవరి 15) కొలంబోలో జరగబోయే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆయన సిద్ధమవుతున్నారు. మహీకా కూడా హార్దిక్‌కు మద్దతుగా ఢిల్లీ వచ్చి ఆయనను ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ మై లైఫ్` అని పిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Hardik inks heartfelt Valentines Day M tattoo :

Hardik Pandya inks heartfelt Valentines Day M tattoo for girlfriend Mahieka 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs