Advertisement
Google Ads BL

హీరో ధనుష్ కి రూ.20 కోట్ల బిగ్ షాక్


కోలీవుడ్ టాప్ స్టార్ ధనుష్ కి తెనాండల్ ఫిల్మ్స్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. తమతో సినిమా చేస్తానని ఒప్పందం కుదుర్చుకుని మోసం చేసాడు అంటూ ధనుష్ ని రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తెనాండల్ ఫిల్మ్స్ డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. పలు సినిమాలతో బిజీగా ఉంటూ తనకంటూ ఓ స్టేటస్ సంపాదించుకున్న ధనుష్ పై ఈ రకమైన ఆరోపణలు రావడం అభిమానులకు షాకిచ్చింది.

Advertisement
CJ Advs

పదేళ్ల క్రితం తమతో సినిమా చేయనని ఒప్పందం కుదుర్చుకుని నాన్ రుద్రన్ అనే సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ ధనుష్ కాల్ షీట్స్ కేటాయించకుండా, షూటింగ్ ప్రారంభించకుండా ఇబ్బంది పెడుతున్నారని, దాంతో తమ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని సదరు ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.

అందుకే ధనుష్ తమ నష్టాన్ని భర్తీ చెయ్యాలని, అందుకు రూ. 20 కోట్లు చెల్లించాలని తెనాండల్ ఫిల్మ్స్ ధనుష్ కి లీగల్ నోటీసులు పంపించింది. ధనుష్ వెంటనే స్పందించి నష్టపరిహారం చెలించకపోతే తదుపరి చర్యలకు సిద్దమవుతాము అంటూ తెనాండల్ ఫిల్మ్స్ హెచ్చరిస్తుంది. మరి ఈ వివాదం పై ధనుష్ రియాక్షన్ కోసం అందరూ వెయిటింగ్. 

Dhanush faces Rs 20 cr legal notice for delayed film:

Dhanush gets legal notice from Thenandal Films over unfulfilled project commitments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs