Advertisement
Google Ads BL

అదుర్స్ 2 కథ రెడీనే.. కానీ ఎన్టీఆరే


యంగ్ టైగర్ ఎన్టీఆర్-వి.వి వినాయక్ కలయికలో తెరకెక్కిన అదుర్స్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ బ్రాహ్మణుడిగా పంతులు గెటప్ లో చేసిన కామెడీ ని ఇప్పటికి బుల్లితెర పై ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని దర్శకుడు వినాయక్, ఇంకా రైటర్ కోన వెంకట్ తరచూ చెబుతున్నారు.. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

Advertisement
CJ Advs

తాజాగా రైటర్ కోన వెంకట్ మరోసారి అదుర్స్ 2 పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అదుర్స్ 2 కథ రెడీగా ఉంది, కానీ ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తర్వాత అదుర్స్ 2 కథ వింటాను అన్నారు అంటూ కోన వెంకట్ బ్యాండ్ మేళం ప్రెస్ మీట్ లో చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 

ఒకవేళ అదుర్స్ 2 కథ ఎన్టీఆర్ కి నచ్చినా ఎవరు దీనిని డైరెక్ట్ చేస్తారు, ఎందుకంటే వినాయక్ ప్రస్తుతం ఫామ్ లో లేరు. మరి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో, అదుర్స్ 2 కథ పాన్ ఇండియా కి సరిపోతుందా అనే అనుమానాలు చాలామంది లో ఉన్నాయి. మరి ఇది ఎలా పట్టాలెక్కుతుందో చూడాలి. 

Kona Venkat on Adhurs 2:

Kona Venkat on Adhurs 2 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs